అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) కీలక తీర్పు వెలువరించింది, తన కుటుంబ సభ్యులు చేసిన దాడి కారణంగా భర్త సంపాదన శక్తిని కోల్పోయిన పరిస్థితుల్లో, ఆ భార్యకు భరణం పొందే హక్కు ఉండదని. భార్య తరపు బంధువులు జరిపిన కాల్పుల్లో వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో, హోమియోపతి డాక్టర్‌గా పనిచేస్తున్న భర్త శాశ్వత వికలాంగుడిగా మారిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త శారీరక, ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను తిరస్కరించింది.
Read Also: Tamil Nadu : తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్ – ప్రధాని మోదీ
భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది
భార్య కుటుంబ సభ్యులు చేసిన నేరపూరిత దాడి వల్ల.. భర్త తన జీవనోపాధిని కోల్పోతే, ఆ భర్త నుంచి భార్య భరణం కోరలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ లక్ష్మీ కాంత్ శుక్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ తీర్పునిస్తూ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌కు చెందిన డాక్టర్ వేద ప్రకాష్ సింగ్ (హోమియోపతి డాక్టర్) మీద 2019లో అతని భార్య తండ్రి, సోదరుడు కలిసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డాక్టర్ వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. డాక్టర్ల సలహా ప్రకారం ఆ బుల్లెట్ పెల్లెట్‌ను శరీరంలో నుంచి తొలగిస్తే ఆయనకు పక్షవాతం వచ్చే అవకాశం ఉండటంతో దాన్ని అలాగే ఉంచారు.

దీనివల్ల వేద ప్రకాష్ సింగ్ కనీసం కూర్చోలేక, తన డాక్టర్ వృత్తిని కొనసాగించలేక నిరుద్యోగిగా మారిపోయారు.భార్య తరపు వారు చేసిన దాడి వల్ల భర్త సంపాదన శక్తిని కోల్పోయినప్పుడు.. అదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని భార్య భరణం అడగడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. తమ సొంత తప్పిదాల వల్ల కలిగిన నష్టాన్ని అనుకూలంగా మార్చుకుని భరణం కోరడం అన్యాయమని ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: