దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్, ట్యాబ్లెట్లకు భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాజా నివేదిక ప్రకారం, Android 13, 14, 15, 16 వెర్షన్లలో తీవ్రమైన సెక్యూరిటీ లోపాలు (Security Vulnerabilities) ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు యూజర్ల ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Read Also: Winter Season : దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న చలి – హెచ్చరిక జారీచేసిన IMD

సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం అత్యవసరం
సైబర్ నిపుణుల ప్రకారం, ఈ బగ్స్ ద్వారా హ్యాకర్లు ఫోన్లోని పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, ఫోటోలు, మెసేజ్‌లు, లొకేషన్ డేటా వంటి వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా శామ్‌సంగ్ (Samsung), వన్‌ప్లస్ (OnePlus), షియోమీ (Xiaomi),
రియల్‌మీ (Realme), మోటోరోలా (Motorola), వివో (Vivo), ఒప్పో (Oppo), అలాగే గూగుల్ పిక్సల్ (Google Pixel) ఫోన్లను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని CERT-In తెలిపింది. అందుకే వెంటనే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం అత్యవసరం అని సైబర్ అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: