हिन्दी | Epaper

షిరిడి వెళ్లే భక్తులకు అలర్ట్!

Anusha
షిరిడి వెళ్లే భక్తులకు అలర్ట్!

ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. కొన్ని ఘటనలతో ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. ఇక నుంచి టోకెన్ లేని వారిని ప్రసాదాల ఆలయంలోకి అనుమతించమని సంస్థాన్ సీఈవో వెల్లడించారు.షిర్డీ సాయి సంస్థాన్ కొత్త నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా ప్రసాదాల ఆలయంలోకి ఎంట్రీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రసాదాలయంలోకి మద్యపానం, ధూమపానం, నేర ప్రవృత్తి ఉన్నవారిని అరికట్టేందుకు టోకెన్ వ్యవస్థను అమలు ప్రారంభించింది. షిర్డీలో నిత్యం దాదాపు 50 వేల మంది భక్తులు ఉచిత ప్రసాదం స్వీకరిస్తారు. ఈ ప్రసాదాలయం సాయి బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా ప్రసాదం స్వీకరణ కోసం వస్తున్న కొందరితో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, ట్రస్టు బోర్డు అక్కడకు వస్తున్న వారి పైన నిఘా పెట్టింది. కాగా, భక్తులు కాకుండా ఇతరులు వస్తున్నారని గుర్తించారు.

img 20180324 wa0077 largejpg (1)

దీంతో, అటు వంటి వారికి ప్రవేశం లేకుండా టోకెన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. సాయిబాబా దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజన టోకెన్​తో పాటు విభూది, బూందీ ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఒకవేళ దర్శనానికి ముందే భోజనం చేయాలనుకునే భక్తులకు ప్రసాదాల ఆలయంలో ఉచితంగా టోకెన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే రెండు ఆస్పత్రుల రోగులు, వారి కుటుంబీకులకు వసతి ఏర్పాట్లు చేస్తామని వివరించారు.కొద్ది రోజుల క్రితం షిర్డీ సాయి సంస్థాన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హత్యకు గురయ్యారు.సంస్థాన్ అధికారులు అప్రమత్తం అయ్యారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

సమయాన్ని హరించేస్తున్న సోషల్ మీడియా!

సమయాన్ని హరించేస్తున్న సోషల్ మీడియా!

ప్రాణాంతకంగా మారుతున్న ‘ఫైర్వర్క్స్!

ప్రాణాంతకంగా మారుతున్న ‘ఫైర్వర్క్స్!

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

📢 For Advertisement Booking: 98481 12870