ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అక్షయ్ కుమార్ (టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ) సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఛీ ఛీ అసలు అదేం పేరు నిజంగా అది కూడా ఒక పేరేనా అది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా నా దృష్టిలో మాత్రం ఫ్లాప్ మూవీనే అని జయా బచ్చన్ కామెంట్స్ చేశారు. అయితే అందుకు గల కారణాన్ని సైతం బయటపెట్టారు జయాబచ్చన్. తనకు సినిమాలు చూసే విషయంలో ఒక కండిషన్ ఉంటుందని తెలిపారు.ఆ నియమం కారణంగానే ఆ చిత్రం చూడలేదని చెప్పారు. సినిమాలు చూసే విషయంలో తాను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నానని స్పష్టం చేశారు. టైటిల్ నచ్చకపోతే సినిమా చూడనని తేల్చి చెప్పారు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి, అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకే అది బ్లాక్ బస్టర్ మూవీ అయినా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కొల్లగొట్టినా కానీ ఆ చిత్రం అంటే తనకు నచ్చదని మొహమాటం లేకుండా చెప్పేశారు. తన దృష్టిలో అదొక ఫ్లాప్ చిత్రమని అన్నారు.
ప్రధాన పాత్ర
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు అక్షయ్ కుమార్.టాయిలెట్ సినిమాపై జయా బచ్చన్ అలా మాట్లాడి ఉంటే ఆమె చెప్పింది నిజమే. నేను అలాంటి సినిమా తీసి తప్పు చేసి ఉంటే, ఆమె చెప్పింది నిజమే కావచ్చు. ఈ కామెంట్లను నేను స్వాగతిస్తున్న అంటూ అక్షయ్ చెప్పుకోచ్చాడు.అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’. ఈ సినిమాకు శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే పెళ్లి చేసుకొని అత్తారింటికి రావాల్సిన యువతి వరుడి ఇంట్లో టాయిలెట్ లేదని టాయిలెట్ కట్టిస్తేనే అత్తాగారింట్లో అడుగుపెడతానని షరతు పెడుతుంది. అయితే ఇంట్లో టాయిలెట్ కట్టించవద్దని వరుడి తండ్రి అడ్డుపడతాడు. ఈ క్రమంలోనే వరుడు ఏం చేశాడనేది ఈ సినిమా కథ.

కేసరి-2 మూవీ
అక్షయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కేసరి-2. అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్‌లైన్. మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తుండగా,ధర్మ ప్రోడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కేసరి-2 మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్. వేలాది మంది ప్రజలు 1919 ఏప్రిల్ 13న అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. పంజాబ్‌లో యుద్ధ చట్టాన్ని అమలు చేసి, శాంతిభద్రతల బాధ్యతను బ్రిగేడియర్ జనరల్ డయ్యర్‌కు అప్పగించింది. ఆందోళనలు ఇంకా ఆగలేదు.రౌలత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13 న అమృత్సర్‌లోని జలియన్ వాలా బాగ్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 25 నుంచి 30 వేల మంది హాజరయ్యారు. జనరల్ డయ్యర్ తన దళాలతో అక్కడికి వచ్చి నిరాయుధ ప్రజలపై కాల్పులు జరుపుతానంటూ బెదిరించాడు. దాంతో అక్కడ గందరగోళం నెలకొన్నది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగెత్తటం ప్రారంభించారు. చాలా మంది తోటలోని బావిలోకి దూకారు. కాల్పులు సుమారు 10 నిమిషాలు కొనసాగాయి. ఇందులో వేయికి పైగా జనం మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: SS Rajamouli: ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి