మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన విమాన ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉన్నా, పైలట్‌కు అపారమైన అనుభవం ఉన్నా అసలు ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది? విమానం ఎందుకు అదుపుతప్పి నిప్పుల కొలిమిలా మారింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
విమానం అకస్మాత్తుగా కుప్పకూలడం పలు అనుమానాలకు దారితీస్తోంది

బుధవారం ఉదయం (Ajit Pawar) విమానం తొలుత ఒకసారి ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత రెండోసారి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రన్‌వే అంచున విమానం కుప్పకూలింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విమానం లైవ్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్లలో కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బారామతిలో వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. విజిబిలిటీ సుమారు 3,500 మీటర్ల వరకు ఉందని, మంచు లేదా పొగమంచు సమస్యలేవీ లేవని అధికారులు ధృవీకరించారు. ఇక విమానాన్ని నడిపిన పైలట్ సుమిత్ కపూర్ సామాన్యుడు కాదు. ఆయనకు ఏకంగా 16,500 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఇంతటి అనుభవం ఉన్న పైలట్ సమక్షంలో, స్పష్టమైన వాతావరణంలో విమానం అకస్మాత్తుగా కుప్పకూలడం వెనుక ఏదో పెద్ద సాంకేతిక లోపం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
Read Also: Road policy: రహదారి విధానంలో మార్పులవసరం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: