మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాల పాటు కింగ్ మేకర్‌గా, తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన అజిత్ పవార్(Ajit Pawar) నిష్క్రమణ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. తనదైన వ్యూహాలతో, సాహసోపేతమైన నిర్ణయాలతో రాజకీయ యవనికపై అజిత్ పవార్ వేసిన ముద్ర చెరపలేనిది.
Read Also: Baramati plane crash : బారామతిలో కూలిన విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం

అందని ద్రాక్షగానే ‘ముఖ్యమంత్రి’ పీఠం
అజిత్ పవార్ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ, ఒక అసంతృప్తి మాత్రం ఆయనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. అదే ‘ముఖ్యమంత్రి’ పదవి. మహారాష్ట్రను పాలించాలని, సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆయనకు ఎంతో ఆశ ఉండేది. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు.
“నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను” అని ఆయన మనసులోని మాటను ధైర్యంగా చెప్పేవారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుగడలు వేసినా, ఎంతో మందిని సీఎంలను చేసినా.. ఆ కుర్చీ మాత్రం ఆయనకు చివరి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
డిప్యూటీ సీఎంగా అరుదైన రికార్డు
సీఎం పదవి దక్కకపోయినా, మహారాష్ట్ర రాజకీయ(Political of Maharashtra) చరిత్రలో అజిత్ పవార్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. రాష్ట్రంలో అత్యధిక కాలం మరియు అత్యధిక సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. సంక్షోభ సమయాల్లోనూ, సంకీర్ణ ప్రభుత్వాల్లోనూ ఆయన పోషించిన పాత్ర వెలకట్టలేనిది. తన పరిపాలనా దక్షతతో, అధికారులపై పట్టుతో ఆయన ‘బెస్ట్ అడ్మినిస్ట్రేటర్’గా గుర్తింపు పొందారు.
ముగిసిన రాజకీయ అధ్యాయం
రాజకీయ ఎత్తుగడలు వేయడంలో సిద్ధహస్తుడైన అజిత్ పవార్, తన వారసత్వాన్ని బారామతి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ఎంతో మంది యువ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. కింగ్ మేకర్‌గా చక్రం తిప్పిన ఆయన, ఒక కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లడం ఆయన అనుచరులను, అభిమానులను కలిచివేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: