పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్ను (Tax) లు విధించే అవకాశం ఉందని PTI నివేదిక వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న GST పరిహార సెస్‌కు బదులుగా కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను ప్రభుత్వం నోటిఫై చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పాన్‌మసాలా, సిగరెట్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వర్తించే GST రేట్లకు అదనంగా పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించనున్నారు.
Read Also: Chandragrahanam 2026: మార్చి 3న ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: