हिन्दी | Epaper

Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Sharanya
Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలంపట్టిలో ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఆలయం దర్శించుకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పూర్తి ఘటన వివరాలు

కంజంపాటికి చెందిన లక్ష్మి, కరుప్పాయి, పాండిసెల్వి, జ్యోతికతో సహా ఏడుగురు వ్యక్తులు ఉసిలంపాటిలోని ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్నవారిపై వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది.

ఘటన స్థలంలోనే నలుగురు మృతి:

ఈ ప్రమాదంలో పాండిసెల్వి, జ్యోతిక, లక్ష్మి, ఏడాది వయసున్న బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఉన్నారు. ఘటనకు దగ్గరలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం.

పోలీసుల చర్యలు:

ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఉసిలంపట్టి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత పారిపోయిన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. వాహనం వేగంగా రావడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read also: Uttar Pradesh: భర్త ప్రైవేట్ భాగాలపై దాడి ఆ తర్వాత భార్య ఆత్మహత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870