‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’ గా మార్చడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జి మేనల్లుడు అభిషేక్ బెనర్జి (Abhishek Banerjee) తప్పుపట్టాడు. పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
Read Also: http://Sanjay Nishad: బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్నికి ఆజ్యం

అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీకి ‘మహాత్మా’ అనే బిరుదు ఇచ్చారని, మనకు ఇవ్వలేదని అభిషేక్ (Abhishek Banerjee) వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర మార్చడాన్ని బట్టి బీజేపీ మహాత్ముడికి ఇచ్చే విలువ ఏ పాటిదో స్పష్టమవుతున్నదని అన్నారు. కాగా ఇటీవల కేంద్రం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఆ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: