हिन्दी | Epaper

ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్

sumalatha chinthakayala
ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రానున్న ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార ఆప్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 మందిని ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సొంత బలంతో ఎన్నికల్లో గెలుపొందుతుంది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకూ అవకాశం లేదు అని కేజ్రీ వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌ సీట్ల పంపకం కోసం ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి. కూటమిలోని కాంగ్రెస్‌కు 15 సీట్లు, ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కేజ్రీ.. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ ఎన్నికల కోసం రెండు విడతలుగా అభ్యర్ధుల జాబితాల్ని కూడా విడుదల చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ

పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ

గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

తమిళనాడులో ఎన్నికల నగారా..23న పోలింగ్

తమిళనాడులో ఎన్నికల నగారా..23న పోలింగ్

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

📢 For Advertisement Booking: 98481 12870