2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ సంజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తంగా ఏర్పడిన కూటమి లక్ష్యం పూర్తైనందున, ఇకపై తాము ఇందులో భాగమయ్యేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల తర్వాతే నిర్ణయం – కూటమి లక్ష్యం పూర్తయిందన్న ఆప్
సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “ఇండియా కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏర్పడింది. ప్రస్తుతం ఆ ఎన్నికలు ముగిశాయి. కూటమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం నెరవేరింది. అందువల్ల ఇకపై AAP ఈ కూటమిలో కొనసాగదు” అని అన్నారు. ఈ ప్రకటనతో ఇతర కూటమి పార్టీలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశముంది. తమ స్వతంత్ర రాజకీయ పంథాతో ముందుకు సాగాలని ఆప్ సంకల్పించినట్టు అర్థమవుతోంది.
కాంగ్రెస్‌తో విభేదాలే కీలక కారణమా?
ఇతర పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం, ఆప్ – కాంగ్రెస్ మధ్య నెలకొన్న అవిశ్వాసం, ఆపసోపాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అంటున్నారు. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రాయణం తారాస్థాయికి చేరినట్లు భావిస్తున్నారు. ఈ కూటమి నుంచి ఆప్ వైదొలిగిన నేపథ్యంలో, ఇండియా కూటమి బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : HYD Rain : హైదరాబాద్లో ఎంత వర్షం కురిసిందంటే?