हिन्दी | Epaper

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం

sumalatha chinthakayala
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం రాగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు పొరుగున ఉన్న బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతం లోబుచేకి ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 6:35 గంటలకు భూమి కంపించింది.

image
image

టిబెట్‌లోని షిగాట్సే నగరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. భూకంప తీవ్రత నేపాల్ లో అధికంగా ఉంది. గతంలో అక్కడ భారీ భూకంపాలు సంభవించాయని తెలిసిందే. 2015లో నేపాల్ రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఆ సమయంలో దాదాపు 9,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 22,309 మంది గాయపడ్డారు.

నేపాల్ రాజధాని ఖాట్మండుకు చెందిన ఓ వ్యక్తి భూంకంపై స్పందించారు. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలిపారుు. “భూకంపం వచ్చినప్పుడు మేం నిద్రపోతున్నాను, కానీ మేం నిద్రిస్తున్న మంచం కదులుతోంది. మా బాబు మంచం కదిలిస్తున్నాడని మొదట అనుకున్నాను. కానీ కిటీకీలు కూడా కదలడం చూసి భయం వేసింది. ఇది భూకంపం అని నిర్ధారించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. మా అబ్బాయికి ఫోన్ చేయడంతో అతడు కూడా క్షణాల్లో బయటకు వచ్చాడని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870