భారత సరిహద్దు భద్రతా దళం (BSF) స్పోర్ట్స్ కోటా ద్వారా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 391 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించబడగా, నవంబర్ 4 (ఎల్లుండి) దరఖాస్తు చేసుకునే చివరి తేదీగా నిర్ణయించారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరచిన యువతకు ఇది ఒక అద్భుత అవకాశం. దేశ రక్షణతో పాటు క్రీడా రంగంలో తమ ప్రతిభను కొనసాగించే అవకాశం లభించనుంది.
BREAKING -Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్
ఈ పోస్టులకు పదవ తరగతి (10th) లేదా ఇంటర్మీడియట్ (12th) ఉత్తీర్ణత తప్పనిసరి అర్హతగా నిర్ధారించారు. అలాగే అభ్యర్థులు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించి ఉండాలి. అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారిని ప్రాధాన్యంగా పరిగణిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర రిజర్వేషన్ గల వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు కల్పించారు.

ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష, అలాగే స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళంలో ప్రతిష్టాత్మక సేవ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, క్రీడా రంగంలో ఉన్నత స్థాయి శిక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్లో లాగిన్ అయి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నందున అర్హత కలిగిన క్రీడాకారులు వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/