ఈ నెల 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash ) దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ భయానక ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు (279 Dies) కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మృతుల గుర్తింపులో అధికారులు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 202 మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
157 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింపు
గుర్తించబడిన మృతదేహాల్లో 157 మృతుల దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 11 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. అధికారులు శేష మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నారు. DNA పరీక్షలు, బహుళ స్థాయిలో తీసిన శరీర అవశేషాల తాలూకు విశ్లేషణ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి
ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోవడం ఘటనను మరింత విషాదంగా మార్చింది. దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ సహాయ చర్యలు కొనసాగిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
Read Also : Chiranjeevi : అనిల్ మూవీ లో చిరు పాత్ర పేరు అదేనా..?