हिन्दी | Epaper

సైఫ్ స్పైన్ వద్ద లోతైన గాయం

Vanipushpa
సైఫ్ స్పైన్ వద్ద లోతైన గాయం

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడంతో ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. రెండున్నర గంటలుగా వేర్వేరు విభాగాలకు చెందిన డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహిస్తోన్నట్లు డాక్టర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మటిక్ సర్జన్ డాక్టర్ లీలా జైన్, అనస్థీషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తోన్నామని తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీలు నిర్వహించామని పేర్కొన్నారు. శరీరంపై మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లను గుర్తించామని డాక్టర్ నీరజ్ చెప్పారు. రెండు లోతైన గాయాలు ఉన్నాయని వివరించారు. మెడ-వెన్నెముక వద్ద కత్తి గాయమైందని, అందులో చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించామని తెలిపారు. జాగ్రత్తగా దాన్ని తొలగించాల్సి ఉంటుందని, సర్జరీ కొనసాగుతోందని పేర్కొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు పొడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ. గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్‌లో భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి నివసిస్తోన్నారు సైఫ్ అలీ. హై- సెక్యూరిటీ జోన్‌గా పరిగణిస్తుంటారీ ప్రాంతాన్ని. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది. దోపిడీ కోసం అతను ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తోన్నారు. ఇంటి పనిమనిషులు తొలుత అతన్ని చూసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు. ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తం అయ్యారు. సైఫ్ అలీను మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీనితో సైఫ్ అలీ అక్కడే రక్తపుమడుగులో పడిపోయారు. ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870