हिन्दी | Epaper

రైతుల ఖాతాల్లో రూ 10 వేలు?

Vanipushpa
రైతుల ఖాతాల్లో రూ 10 వేలు?

కొత్త సంవత్సరంలో రైతులకు మేలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రూ 10 వేలకు పెంపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంపు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ 2019 నుంచి ప్రతీ ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ 6 వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ 2 వేల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.10 వేలకు పెంచేందుకు కేంద్రం నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ రోజున కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా రూ.10 వేలు జమ అయ్యేలా నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తారని ప్రచారం సాగుతోంది.

కొత్త సంవత్సరం వేళ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అటు జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తున్న వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది.

నేటి భేటీలో చర్చ కొంత కాలంగా కిసాన్‌ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని.. ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కొత్త లక్ష్యాల వేళ ముందుగానే ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు 18 వాయిదాలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. వచ్చే నెల మలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జయ చేయనుంది. ఈ దశలో కేంద్రం నిర్ణయం ఏంటనేది నేడు స్పష్టత రానుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870