Nara Lokesh returned from Davos

దావోస్ నుంచి తిరిగొచ్చిన లోకేష్

అమరావతి: ఐదు రోజుల దావోస్ పర్యటన ముగించుకున్న ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వదేశానికి తిరిగొచ్చారు. శనివారం తెల్లవారుజామున 1.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ పలువురు ప్రముఖులతో సమాదేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.

Advertisements

యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 4 రోజుల పాటు దావోస్ వేదికగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేశారు లోకేష్. ఏపీలో పెట్టుబడుల కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లి రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ కు ఉన్న అనుకూల పరిస్థితులను, కూటమి ప్రభుత్వ సహకారంపై దిగ్గజ సంస్థల అధినేతలతో నారా లోకేష్ సమావేశమై చర్చలు జరిపారు. త్వరలోనే వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోనున్నారు.

image

పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు అవుతూనే మరోవైపు నారా లోకేష్ 8 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు హాజరై కూటమి ప్రభుత్వ పాలసీలు, చంద్రబాబు విజన్ ను వారికి వివరించారు జూన్ నెలలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీసుకుంటున్న పారిశ్రామిక విధానాల నిర్ణయాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ (AI), క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ వ్యాపార అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో లోకేష్ చర్చలు జరిపారు.

దావోస్ లో జరిగిన పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దావోస్ లో బ్రాండ్ ఏపీని మంత్రి నారా లోకేష్ ప్రమోట్ చేసి పెట్టుబడుల కోసం శ్రమించారు. మొత్తం 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

Related Posts
సస్పెన్షన్ తర్వాత మల్లన్న టీం స్పందన
Theenmar Mallanna suspended from Congress party

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులగణన వ్యవహారం భారీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. బీసీ కులగణనలో Read more

AP Cabinet : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
Cabinet approves AP Annual Budget

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన విధానాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ Read more

NTR Vaidya Sevalu : ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
ntr vaidya seva

ఆంధ్రప్రదేశ్‌లోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 7వ తేదీ నుంచి నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వానికి ఆసుపత్రుల నుంచి Read more

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి
A terrible road accident.. 10 devotees died

ల‌క్నో: ఈరోజు ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది తీవ్రంగా Read more

×