ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), తన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని షేర్ చేశారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన ఆయన ట్వీట్ ప్రస్తుతం అభిమానులు, ప్రజానేతల అందరినీ ఆకట్టుకుంటోంది.

చంద్రబాబు ట్వీట్ హైలైట్
“పుట్టినరోజు శుభాకాంక్షలు భువనేశ్వరి! నీ ప్రేమ, బలం మన కుటుంబానికి పునాది వంటివి. జీవితంలోని ప్రతి ఒడిదుడుకులోనూ నా పక్కనే నిలిచావు. జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను” అంటూ చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సతీమణి పాత్రపై ప్రశంసల వర్షం
భువనేశ్వరి కేవలం ఒక రాజకీయ నాయకుడి సతీమణిగా మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసిన మహిళ అని చంద్రబాబు తెలిపారు. ఆమె దయా గుణం, ప్రజల పట్ల శ్రద్ధ, మరియు సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతను ఆయన ప్రశంసించారు.
విజయవంతమైన నాయకురాలిగా భువనేశ్వరి
భువనేశ్వరి — హేరిటీజ్ ఫుడ్స్ కంపెనీ ద్వారా వ్యాపార రంగంలో గొప్ప విజయాలను సాధించడమే కాక, అనేక సేవా కార్యక్రమాల్లోనూ నిగూఢమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. నాయకత్వ పటిమ తమ అందరికీ స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు కొనియాడారు.
Read also: Narendra Modi: నేడు విశాఖ రానున్న ప్రధాని మోదీ – వేడుకలకు ఘన ఏర్పాట్లు
Nara Lokesh: జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారు : మంత్రి నారా లోకేష్