हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Nani: విశ్వక్ సేన్‌తో వివాదంపై స్పందించిన నాని

Anusha
Nani: విశ్వక్ సేన్‌తో వివాదంపై స్పందించిన నాని

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా థ్రిల్లర్ చిత్రం ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. సమ్మర్ స్పెషల్ గా మే 1న భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. శైలేష్ కొలను దీనికి దర్శకుడు. ఆయన క్రియేట్ చేసిన హిట్ వెర్స్ లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన రెండు పార్ట్స్ మంచి సక్సెస్ సాధించాయి. అందుకే మూడో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాని పాన్ ఇండియా వైడ్ గా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చారు.2020లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. విక్రమ్ రుద్రరాజుగా విశ్వక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసారు. అయితే ‘హిట్ 2: ది సెకండ్ కేస్’లో విశ్వక్ ని కాకుండా అడివి శేష్ ని లీడ్ రోల్ లో తీసుకొచ్చారు. దీంతో నిర్మాత నానితో విశ్వక్ కి మధ్య ఏదో వివాదం జరిగి ఉండొచ్చనే విధంగా రూమర్స్ పుట్టుకొచ్చాయి. విశ్వక్ కాదనడంతోనే శేష్ దగ్గరకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. దీనిపై నాని తాజాగా స్పందిస్తూ ఇదొక యూనివర్స్ అని ‘హిట్ 1’లో విశ్వక్ ఉంటే, ‘హిట్ 2’లో శేష్ ఉన్నాడని స్పష్టం చేసారు.

సీక్వెల్

విశ్వక్ సేన్ తో ఎలాంటి ఇష్యూ లేదని, స్క్రిప్ట్ ఐడియా కారణంగా జరిగిన మార్పులే అని నాని తెలిపారు. ”హిట్ సినిమాకి సెకండ్ పార్ట్ చేద్దామనే ఐడియా వచ్చినప్పుడు, అందరం సరదాగా విశ్వక్ సేన్ తో చేద్దాం అనుకున్నాం. స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక తెలంగాణ హిట్ కాకుండా ఆంధ్రా హిట్ అయింది. అప్పుడు ఇంకో కాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? సీక్వెల్ మాదిరిగా కాకుండా, హిట్ వెర్స్ మాదిరిగా చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన స్టార్ట్ అయింది. తప్పకుండా రాబోయే సినిమాల్లో విశ్వక్, శేష్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. అది ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తాం అనేది తర్వాత తెలుస్తుంది” అని నాని అన్నారు.ఒక క్రైమ్ థ్రిల్లర్ మంచి హిట్టయింది కాబట్టి, దానికి సీక్వెల్ తీద్దాం అని అనుకోలేదు. కాప్ యూనివర్స్ లో ‘అవెంజర్స్’ లాంటి వైబ్ ఇవ్వాలని అనుకున్నాం. ఆ ఆలోచన వచ్చిన తరువాత ఆటోమేటిక్ గా వేరే డైరెక్షన్ తీసుకుంది” అని నాని చెప్పుకొచ్చారు. ‘హిట్ 2’ సినిమాలో అడివి శేష్ ని హీరోగా తీసుకోవడంపై గతంలో విశ్వక్ ని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా బిజీగా ఉండటం వల్లనే తాను చేయలేకపోయానని చెప్పారు. పార్ట్-3లో ఉండే అవకాశం ఉందా? అని అడిగితే ఈ విషయం దర్శక నిర్మాతలను అడగాలని అన్నారు. కథ నచ్చితే తాను చేయడానికి సిద్ధమేనని తెలిపారు.

Hit

డబ్బింగ్

ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంపై నాని మాట్లాడుతూ ”నేను హిందీ మార్కెట్ కోసం ట్రై చేయడం లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు నా సినిమాల హిందీ డబ్బింగ్ వెర్సన్స్ చూసినట్లు చెప్తారు. నార్త్ ఆడియన్స్ నుంచి నాకు ఎంతో ప్రేమ లభిస్తోంది. మీరు పాన్ ఇండియా ఫిలిమ్స్ అని ఒక ట్యాగ్ వేసేస్తున్నారు కానీ నేనెప్పుడూ అలా చూడలేదు. అని తెలిపారు.

Read Also: Kaliyugam 2064 Movie: కలియుగమ్‌-2064 మూవీ ట్రైల‌ర్ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870