నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కలవటాల దాటగానే ప్రమాదానికి గురైంది. కలవటాల వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన డ్రైవర్ ఓ చేయి స్టీరింగ్ మీద, మరో చేతితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో బోల్తాపడింది.

Advertisements
నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

ప్రభుత్వ ఆస్పత్రులకు తరలింపు
బస్సు ఒక్కసారిగా బోల్తాపడటంతో అందులోని ప్రయాణికులు భయపడిపోయారు. బస్సు ముందు భాగంలోని అద్దాలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. వారిని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. గాయపడిన వారి అరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆరా తీశారు. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులను వివరణ కోరారు.

లారీ- ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి
మరోవైపు నంద్యాల జిల్లా డోన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. జగనన్న కాలనీలో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టరును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టరు తలకిందులుగా పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ఉన్న చలపతి అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురు హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు – షర్మిల
వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేరు మార్పుపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తన నిర్ణయాలతో పక్షపాతం చూపుతున్నారని, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు వ్యవహరిస్తున్నారని Read more

నేడు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌
AP Cabinet meeting today

అమరావతి: ఈరోజు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌ జరుగనుంది. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమ‌రావ‌తిలో 20 వేల Read more

ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్..?
Airbus helicopters manufact

విమానాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎయిర్ బస్ మన దేశంలో హెలికాఫ్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం నేపథ్యంలో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ Read more

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని ప్రధానితో చెప్పించండి: షర్మిల
Sharmila comments on Prime Minister Modi visit to AP

అమరావతి: అమరావతి : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని Read more

×