हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు

Sharanya
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు

గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలాశయాలు కళ కళలాడుతున్నాయి. దీనితో నదులకి భారీ వరద నీరు చేరుతుంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జల ప్రవాహం పెరుగుతుంది. దీంతో ఆల్మట్టి నుంచి శ్రీశైలం (Srisailam) వరకు జలాశయాలు గత వారంలోనే గరిష్ఠ నీటి మట్టాలకు చేరాయి. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి అదనంగా వచ్చే వరదనంతా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం జలాశయానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో నిన్న నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,896 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌ ఔట్ ఫ్లో 41,882 క్యూసెక్కులు

నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) కు జలాశయానికి వరద ఉదృతి రోజు రోజుకి పెరుగుతుంది. ప్రస్తుతం 2,01,743 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం సాగర్ ఔట్ ఫ్లో (Outflow) 41,882 క్యూసెక్కులుగా నమోదైంది. ఈరోజు ఉదయం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం.

సాగర్ (Nagarjuna Sagar) జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.60 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం గేట్ల నుంచి సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Reconstruction : ఎపి పునర్నిర్మాణం దిశగా ‘పి-4’

Alcohol Lovers : తెలంగాణలోని మద్యం ప్రియులకు శుభవార్త!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870