Myanmar Earthquake: 700 దాటిన మయన్మార్‌ మృతుల సంఖ్య..

Myanmar Earthquake: 700 దాటిన మయన్మార్‌ మృతుల సంఖ్య..

మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తాజా ప్రకటనలో వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైమ్‌లో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

సహాయక చర్యలు

భూకంప ధాటికి ఇప్పటి వరకు 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మయన్మార్, థాయిలాండ్‌లలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్‌లోనూ భూకంపం

భూకంప ప్రభావం థాయ్‌లాండ్‌లోనూ తీవ్రంగా ఉంది. కొన్ని నగరాల్లో భవనాలు బీటలవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.మయన్మార్‌, థాయ్‌లాండ్ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.భూకంప బీభత్సంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ఏ ఎఫ్ ఎస్ హిండన్ నుంచి ఐ ఏఎఫ్ సి 130 జె విమానం సహాయక సామగ్రితో బయలుదేరింది. ఈ సహాయ సామగ్రిలోటెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు,తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం,వాటర్ ప్యూరిఫైయర్స్, హైజీన్ కిట్లు,సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు,తదితర అత్యవసర వస్తువులు ఉన్నాయి. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగించేందుకు భారత్ తక్షణ చర్యలు చేపట్టింది.

MYANMAR QUAKE THAILAND 157 1743181820738 1743181836086

మయన్మార్‌ పరిస్థితి

144 మంది మరణించారని మయన్మార్ అధికారులు తెలిపారు.732 మంది గాయపడ్డారు, మృతుల సంఖ్య 1000 దాటవచ్చని అంచనా.రాజధాని నేపిటాలో 96 మంది, సాగెయింగ్‌లో 18 మంది, క్యుక్సేలో 30 మంది మరణించారు.మొత్తంగా ఒక్క మయన్మార్‌లోనే 694 మంది మృతిచెందారు.గాయపడిన వారిలో 432 మంది రాజధానికి చెందినవారు, సాగెయింగ్‌లో 300 మంది గాయపడ్డారు.వందలాది భవనాలు దెబ్బతిన్నాయి.

థాయిలాండ్‌ పరిస్థితి

బ్యాంకాక్‌లో 8 మంది మరణించారు, మరో 9 మంది గాయపడ్డారు.నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం కుప్పకూలడంతో 100 మందికిపైగా గల్లంతయ్యారు.

Related Posts
ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!
'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగినట్టు ఆ సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో Read more

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగిస్తాను: పుతిన్
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగిస్తాను: పుతిన్

పుతిన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలకు సిద్ధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం ముగించే ఉద్దేశ్యంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ చర్చలు ఉక్రెయిన్ Read more

అమెరికా దెబ్బకు భారత్, చైనా విలవిల
diesel

సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఎగదోస్తున్న అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆ యుద్ధం విషయంలో తటస్థంగా ఉంటున్న దేశాల్ని సైతం కెలుకుతోంది. ఇందులో భాగంగా యుద్దంలో Read more

కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం

షట్‌డౌన్‌ గండం నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *