విజయవాడ కోర్టు వైసీపీ నేత వల్లభనేని వంశీకి 14 రోజుల న్యాయవిధి కింద రిమాండ్ విధించింది. కిడ్నాప్, దాడి, బెదిరింపు కేసులో ఆయనపై ఆరోపణలు నమోదవగా, పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు పై వంశీ భార్య ఇలా స్పందించింది.
వంశీ అరెస్ట్‌పై భార్య పంకజశ్రీ ఆవేదన:
వంశీ భార్య పంకజశ్రీ తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. “పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో వంశీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు” అని ఆమె ఆరోపించారు. అసలు న భర్త ని అందుకు అరెస్ట్ చేసారో ఇప్పటివారికి కూడా చెప్పలేదు అని ఆమె స్పందించారు. వంశీ అరెస్ట్ వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. తన భర్త అరెస్ట్ రాజకీయ ఒత్తిడుల వల్ల జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రాణహాని ఉందని మేజిస్ట్రేట్‌కు కూడా వంశీ స్వయంగా తెలిపారు.

కోర్టు వాదనలు – కీలక నిర్ణయం:
వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వ తరపున వీరగంధం రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. మొదట అర్ధరాత్రి 1:45 గంటల వరకు వాదనలు జరిగాయి. స్పష్టత రాకపోవడంతో మరో అరగంట పాటు వాదనలు కొనసాగాయి. చివరకు కోర్టు వంశీతో పాటు శివరామకృష్ణ, లక్ష్మీపతిలకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
రాజకీయ ప్రభావం – ఏపీ రాజకీయాల్లో దుమారం:
ఈ కేసు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.వైసీపీ వర్గాలు వంశీ అరెస్ట్‌ను న్యాయ ప్రక్రియ అని సమర్థిస్తుండగా, విపక్షాలు మాత్రం ప్రతీకార చర్య అని ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు మరింత రాజకీయ చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కారణాల వలన ఈ కేసులో మళ్లీ కొత్త కోణాలు తెరపైకి వచ్చాయి అని భావిస్తున్నారు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులు కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు, వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతి తదితరులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వంశీ, వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో డబ్బుల లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. వంశీ, ఆయన అనుచరులు సత్యవర్ధన్ నుండి డబ్బులను ఎలానో పొందారు అన్నది కీలక విచారణ అంశంగా మారింది. డబ్బు తీసుకున్న వారు ఎవరని, ఆ లావాదేవీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే విషయాలు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. విపక్షాలు ఈ కేసును పోలీసులపై సొంత ఆశయాలు నెరవేర్చుకోవడం అని ఆరోపిస్తున్నాయి.