हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

IPL2025:రోహిత్ శర్మ నా ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ :ట్రావిస్ హెడ్

Anusha
IPL2025:రోహిత్ శర్మ నా ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ :ట్రావిస్ హెడ్

ఐపీఎల్ 2025 సీజన్ వేడిక మొదలైన తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, తాజాగా తన అభిమాన భారత క్రికెటర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రావిస్ హెడ్ తన మనసులో మాట చెప్పాడు. తాను అభిమానించే భారత క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు ఒక్కసారిగా “రోహిత్ శర్మ” అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అతని కెప్టెన్సీ కూడా అద్భుతమని కొనియాడాడు.ఆస్ట్రేలియా జట్టులో ఉండాలని తాను కోరుకునే భారత ఆటగాడు కూడా అతనేనని తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కాకుండా ఇతర ఫ్రాంచైజీకి ఆడాలంటే ముంబై ఇండియన్స్‌ను ఎంచుకుంటానని చెప్పాడు. మూడు ప్రశ్నలకు సమాధానం రోహిత్ శర్మకు సంబంధించినవే చెప్పడంతో రోహిత్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మకు ట్రావిస్ హెడ్ డై హార్డ్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడుగా అని కామెంట్ చేస్తున్నారు ఫాన్స్.

తొలి మ్యాచ్

ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ వైఫల్యం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ట్రావిస్ హెడ్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 67, 47, 22, 4, 8 పరుగులే చేశాడు. అతని వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. తొలి మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లోనైనా ట్రావిస్ హెడ్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫ్యాన్స్ ఫైర్

ట్రావిస్ హెడ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని సెల్ఫీ రిక్వెస్ట్‌ను అతను నిరాకరించడం నెట్టింట చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సూపర్ మార్కెట్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్‌ను కొందరు అభిమానులు సెల్ఫీ కావాలని కోరారు. అందుకు ట్రావిస్ హెడ్ నిరాకరించాడు. తాము సన్‌రైజర్స్ అభిమానులమని చెప్పినా వినిపించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ఇంత బలుపు ఏంటని ఫ్యాన్స్ మండిపడ్డారు.ముంబై ఇండియన్స్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, రోహిత్‌ను పక్కన పెట్టడం కొంత వివాదాస్పదమైంది. అయితే ఈ సీజన్‌లోకి వచ్చేసరికి ముంబై ఫ్యాన్స్ కూడా పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించారు. 

Read Also: PSL 2025: కెప్టెన్ల సమావేశానికి డేవిడ్ వార్నర్ గైర్హాజరు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870