ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసులు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో ప్రార్థనలు చేయరాదని, ఎవరైనా ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీరట్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ హెచ్చరించారు. మత పెద్దలు, ఇమామ్‌లకు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశామని, ప్రజలు మసీదులలోనే ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారి పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్
కొత్త పాస్‌పోర్ట్ పొందడానికి కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) తీసుకోవల్సి ఉంటుందని తెలిపారు. గత ఏడాది కూడా ఈద్ సందర్భంగా కొంతమంది వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ గుర్తు చేశారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండటానికి అన్ని సున్నితమైన ప్రాంతాలలో అదనపు భద్రతా దళాలను మోహరిస్తారని అన్నారు. లక్నో, సంభాల్, అలీఘర్ సహా ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో రోడ్లు, ప్రమాదకరమైన భవనాలపై ప్రార్థనలను నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై జనం గుమిగూడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

200 మందిపై కేసులు
గత సంవత్సరం ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి 200 మందిపై కేసులు నమోదైనట్లు గుర్తుచేశారు. వారిలో 80 మందికి పైగా వ్యక్తులను గుర్తించామన్నారు. ఈ ఏడాది కూడా రోడ్డుపై నమాజ్ చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. పోలీసులు ఆయా ప్రదేశాల్లో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా సున్నితమైన ప్రాంతాలను పర్యవేక్షిస్తారు. పోలీసులు సోషల్ మీడియాను కూడా పర్యవేక్షిస్తారు. నెట్టింట పుకార్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు.
భద్రతా ఏర్పాట్లు
సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా దళాలను మోహరించారు.డ్రోన్లు, సీసీటీవీల ద్వారా నిఘా,సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, సంభాల్, అలీఘర్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రార్థనలను నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
వివాదం
మీరట్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ఘాటుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సంభాల్ ఎస్పీ, ఎంపీ జియావుర్ రెహమాన్ బార్కే – ‘‘నమాజ్ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని ప్రకటించారు.కేంద్ర మంత్రి జయంత్ చౌదరి – ఈ నిర్ణయాన్ని “1984 ఆర్వెల్లియన్ పోలీసింగ్” గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. పోలీసులు పాస్‌పోర్ట్‌లను జప్తు చేస్తామనడం సరికాదన్నారు. ప్రజల సమ్మతిని పొందడానికి వారితో సున్నితంగా వ్యవహరించాలని అన్నారు.
భద్రత చర్యలు
ఇటీవలే రహదారుల భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.మీరట్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఒక వైపు భద్రత చర్యలుగా చూస్తుంటే, మరొక వైపు ప్రజాస్వామ్యం హక్కుల పరిరక్షణపై చర్చనీయాంశంగా మారింది. ముస్లిం మత పెద్దలు,దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, పోలీసులు మాత్రం నిబంధనలను అమలు చేస్తామని చెప్పారు.