Saurabh Murder Case:ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలి:రాహుల్ రాజ్‌పుత్

Saurabh Murder Case:ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలి:రాహుల్ రాజ్‌పుత్

సౌరభ్ రాజ్‌పుత్ గతంలో మర్చంట్ నేవీ అధికారిగా పనిచేసేవాడు. 2016లో ముస్కాన్ ర‌స్తోగితో పెళ్లి జరిగాక, నేవీ ఉద్యోగాన్ని వదిలేశాడు. గత కొన్నేళ్లుగా మేరఠ్​లోనే ఉంటున్న వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. పాప పుట్టిన తర్వాత భార్య ముస్కాన్‌కు 25 ఏళ్ల సాహిల్‌తో స్నేహం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈక్రమంలో తన బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో సౌరభ్ లండన్‌కు వెళ్లి ఒక బేకరీలో పనిలో చేరాడు. భర్త వేరే దేశానికి వెళ్లడంతో ప్రియుడికి ముస్కాన్ మరింత దగ్గరైంది. కుమార్తె బ‌ర్త్‌డే కోస‌మ‌ని సౌరభ్ ఇటీవలే లండన్ నుంచి మేరఠ్​కు వచ్చాడు. దీంతో భర్త త‌మ వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తాడని భావించిన ముస్కాన్‌, ప్రియుడితో కలిసి అతడిని కిరాత‌కంగా చంపింది. సౌరభ్ మృతదేహాన్ని సిమెంటుతో నింపిన డ్రమ్ములో వేసి సీల్ చేయించింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్లింది.

Advertisements

రాహుల్ స్పష్టం

ఈ కేసులో కేసులో కీలక మలుపుతిరిగింది. మేరఠ్​ జైలులో ఉన్న ముస్కాన్ 50రోజుల గర్భిణి అని తేలడంపై సౌరభ్‌‌ రాజ్‌పుత్‌ కుటుంబీకులు కీలక వ్యాఖ్యలు చేశారు. సౌరభ్ లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చే వరకు లవర్ సాహిల్‌ శుక్లా తోనే ముస్కాన్ గడిపినందున, ఆమె ఎవరి బిడ్డకు తల్లి కాబోతోందనే ప్రశ్న తలెత్తనుందని, సౌరభ్ సోదరుడు రాహుల్ రాజ్‌పుత్ అన్నారు. నిజమేంటో తెలుసుకునేందుకు ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ బిడ్డ సౌరభ్‌దే అని తేలితే తమ కుటుంబమే పసికందును పెంచుతుందన్నారు. అది సాహిల్ బిడ్డ అయితే, తాము పట్టించుకోమని రాహుల్ స్పష్టం చేశారు.

వైద్య నిపుణులు

ముస్కాన్ భర్త సౌరభ్​ ఫిబ్రవరి 22న లండన్ నుంచి మేరఠ్​కు వచ్చాడు. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్‌ను మార్చి 3న హత్య చేశారు. అంటే మేరఠ్​కు వచ్చాక సౌరభ్ కేవలం 10 రోజులే బతికాడు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 2 వరకు ముస్కాన్, సౌరభ్ ఒకరితో ఒకరు అన్యోన్యంగానే ఉన్నారు. ఈక్రమంలో వారి మధ్య ఎలాంటి గొడవలు జరిగినట్లు సమాచారం లేదు. మహిళకు గర్భధారణ జరగడానికి ఇంత సమయం సరిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అంతకుముందు కొన్ని నెలల పాటు లవర్ సాహిల్‌ శుక్లాతో ముస్కాన్ తెరచాటు వ్యవహారాన్ని నడిపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త సౌరభ్‌ను హత్య చేసిన తర్వాత మార్చి 17 వరకు ఆమె ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్లొచ్చింది.ఆమె ఎవరి బిడ్డకు తల్లి కాబోతోందనే ప్రశ్న తలెత్తనుంది.

 Saurabh Murder Case:ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలి:రాహుల్ రాజ్‌పుత్

గత కొన్నేళ్లుగా మేరఠ్​లోని ఒక అద్దె ఇంట్లో ముస్కాన్, సౌరభ్ ఉంటున్నారు. ముస్కాన్ వ్యవహార శైలి గురించి ఆ ఇంటి యజమాని ఓంపాల్ కీలక వివరాలను వెల్లడించారు,బహుశా ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డ సాహిల్ బిడ్డ కూడా కావొచ్చని ఓంపాల్ వ్యాఖ్యానించడం గమనార్హం.మార్చి 3న సౌరభ్‌ను హత్య చేసిన తర్వాతి నుంచి మార్చి 17 వరకు సాహిల్, ముస్కాన్‌లు కలిసి గడిపారు. మేరఠ్​ నుంచి శిమ్లాకు వెళ్లి మార్చి 4న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 13 రోజుల పాటు హనీమూన్ జరుపుకొన్నారు. మొత్తం 15 రోజుల పర్యటనలో అన్యోన్యంగా గడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇన్నాళ్లూ భారత్​లో లేనందున ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డను సౌరభ్ అంగీకరించడని అందుకే అతన్ని హతమార్చి ఉండొచ్చా? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

Related Posts
Sovereign Bonds: రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ
Sovereign Bonds: రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ

ఎనిమిదేళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2016-17 సిరీస్-4 బాండ్ల మెచ్యూరిటీ Read more

Medha Patkar : పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్
Medha Patkar పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమ నాయకురాలు మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఈ అరెస్టు Read more

Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..
Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నాపత్ర లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన Read more

Russian: జెలెన్స్కీ స్వస్థలంలో రష్యా దాడిలో 18 మంది మృతి
జెలెన్స్కీ స్వస్థలంలో రష్యా దాడిలో 18 మంది మృతి

శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిగ్ నగరంపై రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడిలో 18 మంది మరణించారని, వారిలో తొమ్మిది మంది పిల్లలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×