తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు. తలసేమియా బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాల వివరాలను నారా భువనేశ్వరి, తమన్ మీడియాకు వివరించారు. విజయవాడలో జరగనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

చాలా సంతోషంగా ఉంది: తమన్
ఈ షో తాను చేయడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమం చేయాలి అని తనను అడిగారని.. తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే తాను వెంటనే ఈ కార్యక్రమంకి వస్తా అని చెప్పానన్నారు. నారా భువనేశ్వరి తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారని, ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. తలసేమియా బాధితులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడతారని నారా భువనేశ్వరి అన్నారు. వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె మరొకసారి స్పష్టం చేశారు.