ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా , టాప్-3లో నిలిచిన జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో తడబడుతున్నాయి. వరుసగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టాప్-3 టీమ్స్ ఓడిపోయాయి. లక్నో చేతిలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ ఓడగా తాజాగా పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. ఈ మూడు జట్లతో పాటు ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఈ నాలుగు జట్లు టాప్-2 ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఆర్‌సీబీ, గుజరాత్, పంజాబ్ ఓటముల నేపథ్యంలో పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచేందుకు ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్ లభించింది.పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధిస్తే టాప్-2లో నిలవనుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 18 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ 17 పాయింట్స్‌తో రెండు, మూడు స్థానంలో కొనసాగుతున్నాయి. ముంబై ఇండియన్స్ 16 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉంది.

రన్‌రేట్
లక్నోతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధిస్తే 19 పాయింట్స్‌తో టాప్-2లో నిలుస్తుంది. ఓడితే మాత్రం టాప్-2 ప్లేస్ రేసు నుంచి తప్పుకుంటుంది.సీఎస్‌కేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే 20 పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఓడినా మెరుగైన రన్‌రేట్‌తో ఉంటే టాప్-2లో చోటు దక్కుతుంది.ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్(Punjab Kings) టాప్-2 ప్లేస్ ఖరారవుతోంది.సీఎస్‌కే చేతిలో గుజరాత్ టైటాన్స్, లక్నో చేతిలో ఆర్‌సీబీ ఓడి పంజాబ్‌పై ముంబై విజయం సాధిస్తే టాప్ ప్లేస్ ఖరారవుతోంది.
Read Also : IND vs ENG: జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ కాకపోవడానికి కారణం ఏంటంటే?