స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రిలేషన్‌షిప్ బ్రేకప్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. “ప్రేమ విఫలం అయినప్పుడు అమ్మాయిలకే ఎక్కువ బాధ కలుగుతుంది” అని రష్మిక స్పష్టం చేశారు. అబ్బాయిలే ఎక్కువగా బాధపడతారని చెప్పడం తనకు అంగీకారమేమీ కాదని, భావోద్వేగాలను బయటపెట్టే విధానం మాత్రమే వేరుగా ఉంటుందని చెప్పారు. “మేము గడ్డం పెంచలేము, మద్యం తాగలేము, అందుకే లోలోపలే బాధను మోస్తాం” అంటూ ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీశాయి.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 21 అక్టోబర్ 2025 Horoscope in Telugu
రష్మిక ఈ వ్యాఖ్యలతో మహిళల భావోద్వేగాలను ప్రతిబింబించారని అభిమానులు భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో బ్రేకప్ తర్వాత అమ్మాయిలు బలంగా నిలబడే ప్రయత్నం చేస్తారే గానీ, మనసులో గాయాలు మాత్రం లోతుగా మిగిలిపోతాయని సోషల్ మీడియాలో అనేకమంది మహిళలు ఆమె మాటలకు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు, కొంతమంది నెటిజన్లు “బ్రేకప్ బాధకు లింగం ఉండదు” అని, “ప్రేమ నిజమైనదైతే అబ్బాయికైనా అమ్మాయికైనా సమానంగా బాధే” అని స్పందిస్తున్నారు. ఈ చర్చతో రష్మిక చేసిన వ్యాఖ్యలు భావోద్వేగాలపై కొత్త డిబేట్‌ను తెరపైకి తెచ్చాయి.

ఇక రష్మిక నటించిన తాజా చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” నవంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆమె ఒక ప్రేమ విఫలతను ఎదుర్కొని, తన జీవితాన్ని తిరిగి సరిదిద్దుకునే యువతిగా కనిపించనున్నారు. ఈ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు కూడా ఆ సినిమాలోని థీమ్‌కి అనుగుణంగా ఉండటంతో ప్రచారానికి అదనపు బలాన్ని ఇచ్చాయి. రష్మిక భావోద్వేగపూరిత వ్యాఖ్యలు, మహిళా దృష్టికోణాన్ని ప్రదర్శించే ఈ చిత్రంతో ప్రేక్షకుల్లో మరింత అనుబంధాన్ని కలిగిస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/