Raja Saab song: రెబల్ స్టార్ Prabhas హీరోగా, దర్శకుడు Maruthi తెరకెక్కించిన పాన్-ఇండియా చిత్రం The Raja Saab మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటించారు.
తాజాగా ఈ మూవీ నుంచి ‘రాజే యువరాజే’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ పాట సినిమాలో ప్రభాస్, నిధి అగర్వాల్‌ను తొలిసారి చూసే కీలక సన్నివేశంలో ప్లే అవుతుంది. తమన్ అందించిన ఆకట్టుకునే సంగీతం, అద్వితీయ వొజ్జలతో పాటు బేబీ సింగర్ రియా సీపాన గానం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు
భారీ అంచనాల మధ్య రిలీజైన ‘ది రాజా సాబ్’కు మిక్స్‌డ్ (Raja Saab song) టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతం ‘రాజే యువరాజే’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: