Raja Saab new scenes : రెబల్ స్టార్ Prabhas అభిమానులకు శుభవార్త. ఆయన నటించిన తాజా చిత్రం The Raja Saab థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా చిత్రబృందం బ్లాక్‌బస్టర్ మీట్‌ను నిర్వహించగా, దర్శకుడు Maruthi కీలక విషయాలు వెల్లడించారు.
అభిమానుల ఆనందాన్ని మరింత పెంచేలా సినిమాలో కొత్తగా ఎనిమిది నిమిషాల సన్నివేశాలను జోడిస్తున్నామని మారుతి తెలిపారు. ముఖ్యంగా చాలా మంది ఎదురుచూస్తున్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ ఈ కొత్త భాగాల్లో ఉంటాయని చెప్పారు. టీజర్, పోస్టర్లలో కనిపించిన ఆ లుక్ సినిమా విడుదల సమయంలో లేకపోవడంతో కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారని, వారి కోసమే ఈ సీన్స్‌ను యాడ్ చేస్తున్నామని వివరించారు. ఈ కొత్త సన్నివేశాలకు సెన్సార్ పూర్తయిందని, ఈరోజు సాయంత్రం నుంచే థియేటర్లలో వీటిని చూడవచ్చని తెలిపారు.
మారుతి మాట్లాడుతూ, తెలంగాణలో ముఖ్యంగా (Raja Saab new scenes) హైదరాబాద్‌లో షో టైమింగ్స్ సరిగా పడక ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిందని, అందుకు క్షమాపణలు చెప్పారు. ప్రభాస్ తనపై పెట్టిన నమ్మకానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తాను మిడ్ రేంజ్ దర్శకుడినైనా ప్రభాస్ లాంటి స్టార్ తనతో సినిమా చేయడం గర్వకారణమని చెప్పారు. అభిమానులు ప్రభాస్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేందుకు ప్రయత్నించానని అన్నారు.
Vijay: ‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై
సినిమా క్లైమాక్స్ భాగం మైండ్ గేమ్‌లా ఉంటుందని, ముఖ్యంగా చివరి 40 నిమిషాలు చాలా మందికి బాగా నచ్చాయని చెప్పారు. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటివరకు భారతీయ తెరపై సినిమా రాలేదని కొందరు ప్రశంసిస్తున్నారని తెలిపారు. ప్రభాస్ సాధారణ కమర్షియల్ సినిమా చేయవచ్చని, కానీ కొత్త కథలు, కొత్త ప్రయత్నాలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమా చేశారని చెప్పారు.

సినిమా ఫలితాన్ని ఒక్క రోజు లేదా ఒక్క షోతోనే నిర్ణయించవద్దని మారుతి విజ్ఞప్తి చేశారు. కనీసం పది రోజులు వేచి చూస్తే సినిమా స్థాయి తెలుస్తుందని అన్నారు. కొన్ని కొత్త అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు కొంత సమయం పడుతుందని, తొందరపడి విమర్శలు చేయొద్దని కోరారు.
సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నానని మారుతి తెలిపారు. సినిమా ఫలితం గురించి తాను బాధపడుతున్నానని అనుకుని చాలామంది ఫోన్ చేశారని, కానీ తాను పూర్తిగా హ్యాపీగా ఉన్నానన్నారు. అభిమానుల కోసం ముందుగానే ప్రభాస్ ఓల్డ్ గెటప్‌ను థియేటర్లకు తీసుకొస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: