The Raja Saab movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విజువల్ ట్రీట్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండగా, ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ప్రభాస్‌ను కొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తున్నారని సమాచారం. ప్రభాస్ స్టైల్, స్వాగ్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటూ, ఆయనతో కొన్ని క్రేజీ ప్రయోగాలు కూడా చేశారని చిత్రబృందం చెబుతోంది.
Read Also: Charlapalli: అమృత్ భారత్ పథకంలో భాగంగా చర్లపల్లిలో ఆధునిక వసతులు
ఈ క్రమంలో తాజాగా మారుతి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. (The Raja Saab movie) ఈ సినిమాలో ఒక క్రేజీ ఎపిసోడ్ ఉందని, అది ఇప్పటివరకు ఇండియన్ సినిమా తెరపై ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ సీక్వెన్స్‌లో ప్రభాస్ లుక్, అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్ అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయని చెప్పారు.
“ఆ సీన్‌ను థియేటర్‌లో చూసినప్పుడే దాని ఫీల్ పూర్తిగా అర్థమవుతుంది. కేవలం వినడం కాదు, చూడాలి” అని మారుతి కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అంతేకాదు, ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన పాత్ర చాలా కాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ది రాజా సాబ్పై అంచనాలు మరింత పెరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: