దక్షిణ భారత సినీ పరిశ్రమలో అతి పెద్ద కలయికగా భావిస్తున్న రజినీకాంత్–కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఈ ఇద్దరు లెజెండరీ నటులు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్నారు అన్న వార్త సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. 2027లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని, దీనిని ప్రతిష్టాత్మకంగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ ఇద్దరి స్టార్ పవర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News: Trump Health: ట్రంప్ ఆరోగ్యం పై మళ్లీ చర్చ!
ఇకపోతే, రజినీకాంత్ ఈ ప్రాజెక్ట్ తర్వాత సినిమాలకు వీడ్కోలు పలకబోతున్నారని చర్చ నడుస్తోంది. వయసు, ఆరోగ్య పరిస్థితులు, మరియు చాలాకాలంగా కొనసాగుతున్న సినిమా ప్రయాణం కారణంగా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. 2027లో ప్రారంభమయ్యే ఈ చిత్రం రజినీ కెరీర్‌లో చివరి చిత్రం అవుతుందని గట్టి ప్రచారం ఉంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ అభిమానులు ఈ సినిమాను ఆయన కెరీర్‌కు తగిన స్థాయిలో ఒక ఘనమైన ముగింపుగా చూడాలని ఆశపడుతున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్-2 చిత్రీకరణలో ఉన్నారు. ఆ చిత్రం తర్వాత సి. సుందర్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారని తెలుస్తోంది. కమల్ కూడా పలు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ మల్టీస్టారర్‌లో జాయిన్ కానున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/