Rajamouli Varanasi movie : భారతీయ సినీ పరిశ్రమలో మార్కెటింగ్ అంటే ఎలా ఉండాలనే నిర్వచనాన్ని మార్చిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన స్టైల్ చూపించారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి’ సినిమాకు సైలెంట్ ప్రమోషన్‌తో భారీ హైప్ క్రియేట్ చేశారు.
ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, వారణాసి నగరంలో ఒక్క హోర్డింగ్ ఏర్పాటు చేసి “In Theatres April 7, 2027” అనే ఒక్క లైన్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అందులో సినిమా పేరు, హీరో పేరు, దర్శకుడి పేరు ఏదీ లేకపోయినా, ఈ ఫ్లెక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. పవిత్ర నగరమైన వారణాసిని ఈ ప్రమోషన్‌కు ఎంచుకోవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ హోర్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ (Rajamouli Varanasi movie) కావడంతో, అభిమానులు మాత్రమే కాదు… జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై స్పందిస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ డేట్‌ను చెప్పడం ద్వారా రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 7, 2027న సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ ఫ్లెక్స్ ద్వారా స్పష్టమైంది.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం
‘వారణాసి’ ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. భారత పురాణాల ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సాగే ఈ కథ ఫాంటసీ అంశాలతో కూడి ఉంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తూ, ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.
సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి ఒక్క ఫ్లెక్స్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, మరోసారి “హైప్ మాస్టర్” అనిపించుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: