हिन्दी | Epaper

చిరంజీవి వల్లే నేను ఇక్కడ ఉన్నా – పవన్ కల్యాణ్

Sudheer
చిరంజీవి వల్లే నేను ఇక్కడ ఉన్నా – పవన్ కల్యాణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ ‘గేమ్ చేంజర్‘ ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరై తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఈ రోజు మీరు నా పేరు కల్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి లేదా ఏపీ డిప్యూటీ సీఎం అనండి, ఏదైనా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవిగారే. ఆయన స్ఫూర్తి వల్లనే ఈ స్థాయికి చేరుకున్నాను” అని తెలిపారు. చిరంజీవి తన జీవితానికి ప్రధాన ఆధారం అని, మెగాస్టార్ పెట్టిన బాటనే అనుసరిస్తున్నానని వెల్లడించారు.

తెలుగు చిత్ర పరిశ్రమను గొప్పదనం చాటుతూ, పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. “రఘుపతి వెంకయ్య గారు, దాదాసాహెబ్ ఫాల్కే గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి మహనీయులు తెలుగు సినిమా విజయానికి ప్రేరణ” అని పవన్ కల్యాణ్ అభినందించారు. అలాగే, శ్రీమంతులు అయిన శోభన్ బాబు, ఘట్టమనేని కృష్ణ లాంటి ప్రముఖుల కృషిని గుర్తు చేశారు.

ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత గార్ల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఈ ఫంక్షన్ ఇంత పెద్ద స్థాయిలో జరగడం వెనుక సీఎం సహాయం ఉంది. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పవన్ అన్నారు. రాష్ట్ర యంత్రాంగానికి, వేదికపై ఉన్న శ్రీ కందుల దుర్గేశ్‌కు కూడా పవన్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీలో సినీ రంగం అభివృద్ధి కోసం కొత్త అవకాశాలను సృష్టించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అందమైన లొకేషన్లను సినీ చిత్రాల కోసం ఉపయోగించుకోవాలని, తద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రేక్షకుల నుండి విశేషంగా ప్రశంసలు అందుకున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

📢 For Advertisement Booking: 98481 12870