OG Trailer : కౌంట్‌డౌన్ మొదలైంది – పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ దే కాల్ హిమ్ OG విడుదలకు (OG Trailer) ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే! దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, అనౌన్స్ చేసిన రోజు నుంచి అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంకా అరుుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రైలర్‌పై ఫోకస్ – రిలీజ్ డేట్ టుమారో అప్‌డేట్!
ప్రస్తుతం ఫ్యాన్స్ దృష్టి మొత్తం ట్రైలర్‌పై కేంద్రీకృతమైంది. తాజా సమాచారం ప్రకారం, ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రేపే ప్రకటించనున్నారు. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పీక్స్‌కి చేరింది.
సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నడుస్తోంది. ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటే, సినిమా ఓపెనింగ్స్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే అవకాశం ఉంది.

విలన్‌గా ఇమ్రాన్ హష్మీ – పవర్‌ఫుల్ సపోర్టింగ్ క్యాస్ట్
ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
అలాగే ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, శామ్ ముఖ్య పాత్రల్లో నటించి సినిమాకు బలం చేకూరుస్తున్నారు.
గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతున్న OG
ఈ భారీ ప్రాజెక్ట్‌ను DVV దానయ్య మరియు కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది.
దే కాల్ హిమ్ OG సినిమాను 2025 సెప్టెంబర్ 25న గ్రాండ్ మల్టీలాంగ్వేజ్ రిలీజ్ చేయనున్నారు.
Read also :