हिन्दी | Epaper

NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sudheer
NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ (డ్రాగన్) కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ మూవీ ని 2026 జూన్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది ఒక భారీ ప్రాజెక్ట్‌గా నిలవబోతుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ గ్లింప్స్ విడుదల

అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా (మే 20) స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ గ్లింప్స్ కోసం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అద్భుతమైన మేకింగ్, శక్తివంతమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కాగా ఈ నెల 22న ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. షూటింగ్‌ను హై ఓల్ట్జ్ యాక్షన్ సన్నివేశాలతో మొదలుపెట్టినట్టు సమాచారం.

ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తోనే సినిమాపై హైప్

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్లు తీసిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఫోకస్ పెడుతున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టైల్, ఎనర్జీకి ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ కలిస్తే ఫ్యాన్స్‌కి చరిత్రలో మరిచిపోలేని విజువల్ ట్రీట్ దక్కే అవకాశముంది.

Read Also : Re -Release : థియేటర్స్ లలో మరోసారి ‘వర్షం’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

‘మధుబాల’గా సాయిపల్లవి?

‘మధుబాల’గా సాయిపల్లవి?

ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

📢 For Advertisement Booking: 98481 12870