Meenakshi Chaudhary movies : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న నటి మీనాక్షి చౌదరి, ప్రస్తుతం మంచి ఫేజ్‌లో కొనసాగుతోంది. గత సంవత్సరం మొత్తం ఆమె కొత్త సినిమాలు సైన్ చేయకుండా, ఒక్క సినిమాపైనే పూర్తిగా దృష్టి పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అదే నిర్ణయం ఆమె కెరీర్‌కు బలమైన మైలురాయిగా మారింది.
గత ఏడాది మీనాక్షి ‘సంక్రాంతికి వస్తున్నం’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చినప్పటికీ, ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు పూర్తిగా కమిట్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం సినిమా హీరో నవీన్ పోలిశెట్టి, నిర్మాత నాగ వంశీ అభ్యర్థన మేరకు తీసుకున్నట్లు సమాచారం. కథ, పాత్రపై పూర్తి నమ్మకంతో ఆమె ఇతర ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టి ఈ సినిమాకే ఒక సంవత్సరం అంకితం చేసింది.
ఆ సమయంలో “ఒకే సినిమాపై ఇంత కాలం ఫోకస్ పెట్టడం రిస్క్ కాదా?” అనే సందేహం ఆమెకు కూడా వచ్చిందట. కానీ ఇప్పుడు సినిమా (Meenakshi Chaudhary movies) ప్రేక్షకుల మెప్పు పొందడంతో, మీనాక్షి తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపితమైంది. ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు వచ్చిన స్పందనతో పాటు, ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!
ఇదిలా ఉండగా, సంక్రాంతి సీజన్ మీనాక్షికి ప్రత్యేకంగా కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నం’, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’—రెండూ పండుగ సమయంలోనే విడుదలై మంచి ఫలితాలు అందుకోవడంతో ఆమెను అభిమానులు “సంక్రాంతి లక్కీ చార్మ్”గా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం మీనాక్షి తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. స్టార్ హీరోలతో, బలమైన కథలతో ముందుకు వెళ్తే ఆమె కెరీర్ మరింత బలపడే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి ప్రాజెక్ట్ ఏంటన్నది ఇంకా ఖరారు కాలేకపోయినా, మీనాక్షి నుంచి మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: