మంచు లక్ష్మి ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే అప్పుడు సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఆమె గోవాలో ఎక్కిన 6E585 విమానంలో ప్రయాణించే అపుడు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో తన మనోవేదనలను పంచుకుంది.
ఎయిర్‌లైన్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన లగేజీని తప్పుగా హ్యాండిల్ చేశారని మంచు లక్ష్మి పేర్కొంది. వారు తన లగేజీ బ్యాగ్‌ని పక్కకు నెట్టి, దాన్ని తెరవడానికి తనని అనుమతించలేదు అని వారి సూచనలను పాటించకుంటే తన వస్తువులను గోవాలో వదిలిపెడతామని బెదిరించారు అని పేర్కొన్నారు. తన బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్‌ను కూడా వేయలేదు అని ఇది ఒక రకమైన వేధింపు అని నేను ఇంకెప్పుడూ ఇండిగోతో ప్రయాణించను అని ఆమె పేర్కొంది. మంచు లక్ష్మి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్, తాము ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకుంటామని, తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొంది.