కృతి శెట్టి తెలుగులో తన కెరీర్‌ను ‘ఉప్పెన’ సినిమాతో ప్రారంభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో, కృతి శెట్టి ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కు వరుస యంగ్ స్టార్స్ నితిన్, నాగ చైతన్య, రామ్, నాని, శర్వానంద్ వంటి హీరోలతో నటించే ఛాన్స్ దక్కింది. కానీ అవేవి కూడా విజయాలు సాధించలేకపోయాయి. దీంతో అమ్మడికి ఐరెన్ లెగ్ అనే ముద్రపడింది.

తమిళ్ , మలయాళం లో బిజీ
ఇదే సమయంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతో కృతి శెట్టి కి అవకాశాలు లేకుండాపోయాయి. ప్రస్తుతం కృతికి తెలుగు చిత్రపరిశ్రమలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నా, ఆమె తమిళ మరియు మలయాళ భాషల్లో వరుస విజయాలను సాధిస్తుంది. “ఏఆర్‌ఎమ్” అనే తమిళ సినిమాతో హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్న కృతి, తాజాగా మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించింది.
డ్రాగన్ హీరో తో సినిమా
కృతి శెట్టి తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌తో పనిచేయబోతున్నట్లు తెలిపింది. ప్రదీప్ ఇటీవల “లవ్ టూడే” మరియు “డ్రాగన్” వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” సినిమా షూటింగ్ పూర్తి అయిందని, ఈ సినిమాకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఓవరాల్ గా తెలుగు లో గోల్డెన్ లెగ్ అనిపించుకోలేకపోయిన కృతి..తమిళ్ లో అనిపించుకుంటుందో చూడాలి.