हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

jr NTR : మాట వినాల్సింది.. బిగ్ బాస్ తర్వాత కెరీర్ నాశనం.. సంపూ ఆవేదన

vishnuSeo
jr NTR :  మాట వినాల్సింది.. బిగ్ బాస్ తర్వాత కెరీర్ నాశనం.. సంపూ ఆవేదన

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కించుకున్నారు సంపూర్ణేశ్ బాబు. ఈయన అసలు పేరు నర్సింహాచారి. స్క్రీన్ నేమ్ మాత్రం సంపూర్ణేశ్ బాబు అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాల స్పూఫ్ వీడియోలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ ‘మహాత్మ’ సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏకంగా హీరోగా ‘హృదయ కాలేయం’ అనే చిత్రంతో వెండితెరపైకి వచ్చారు. సంపూగా పరిచయమై ప్రేక్షకులను అలరించారు. తొలిచిత్రంతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కామెడీ హీరోగా ప్రశంసలు అందుకున్నారు.మొదటి చిత్రం ‘హృదయ కాలేయం’ గ్రాండ్ సక్సెస్ కావడంతో వరుసగా సినిమాల్లో ఆఫర్లు అందాయి. ‘కరెంట్ తీగ’, ‘పెసరట్టు’ వంటి చిత్రాల్లో క్యామియో రోల్స్ లో కనిపించి మరింత సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘సింగం 123’, ‘వేర్ ఈజ్ విద్యా బాలన్’, లచ్చిందేవికి ఓ లెక్కుంది, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, కాలీఫ్లవర్, చోర్ బజార్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన సినిమాల్లో ‘హృదయ కాలేయం’ తర్వాత అంతటి సక్సెస్ ను మరే చిత్రం అందించలేకపోయింది. ఇక చివరిగా వచ్చిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రం పర్లేదనిపించింది.

అయితే, సంపూర్ణేశ్ బాబు టాలీవుడ్ లో ఒక వెలుగొందుతాడని అంతా భావించారు. ఓవైపు అనుకున్నంత అవకాశాలు వచ్చినా మాత్రం నెక్ట్స్ లెవల్ కు వెళ్లలేకపోయారు. అయినా ఇప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లలో చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సంపూర్ణేశ్ బాబు కెరీర్ ను టర్న్ చేసే అవకాశం ఒకటి కెరీర్ లో వచ్చిందని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆరే తనకు మోటీవేషన్ ఇచ్చినా వినిపించుకోలేదని తానే స్వయంగా చెప్పుకొచ్చారు. అప్పుడు తారక్ అన్న మాటలు విని ఉంటే మాత్రం ఇప్పుడు కెరీర్ మరోలా ఉండేదాని చెప్పుకొచ్చాడు. తన తప్పును గుర్తు చేసుకున్నాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870