తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Gaddar తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీకి ప్రముఖ సినీనటి జయసుధ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలంటూ జ్యూరీ ఛైర్మన్‌తో పాటు సభ్యులను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కోరారు. బుధవారం జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ తొలి సమావేశం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుంటామని, ఎంపిక ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేస్తామని జయసుధ తెలిపారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. Gaddar అవార్డుల జ్యూరీలో నిష్ణాతులైన 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమించిందని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర కాలంలో కూడా సినిమాటిక్ అవార్డ్స్‌కి ఇంతటి స్పందన రాలేదని పేర్కొన్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను పునరుద్ధరిస్తుండటం గర్వకారణమని తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ మాట్లాడుతూ, గద్దర్ అవార్డులకు ఈసారి అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 1,248 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు. ఇందులో 1,172 దరఖాస్తులు వ్యక్తిగత కేటగిరీలకు వచ్చాయని, మిగిలిన 76 దరఖాస్తులు ఫీచర్ ఫిలింలు, బాలల చిత్రాలు, డెబ్యూట్ సినిమాలు, డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్ రచనలు, సినిమా పుస్తకాలు తదితర విభాగాలకు సంబంధించినవని చెప్పారు.ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రతి నామినేషన్‌ను గౌరవప్రదంగా పరిశీలించడానికి జ్యూరీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు సినిమారంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా, చక్కటి ఆధునిక ప్రమాణాల్ని ప్రతిబింబించేలా ఉండబోతున్నాయని అధికారుల అభిప్రాయమన్నారు.
Read More :China : 4 నెలల్లో 85,000 వీసాలు జారీ చేసింది, వాణిజ్య యుద్ధం వేళ