పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైన ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ పాత్రల వేషధారణ, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండ్ విజువల్స్ అన్ని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ట్రైలర్ రాకతో బిజినెస్ వర్గాల్లోనూ సినిమా చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్… ప్రముఖులు హాజరు
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తొలుత తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో ఈవెంట్ నిర్వహించే యోచన చేసినప్పటికీ చివరికి హైదరాబాద్‌నే ఫిక్స్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా సినిమా ప్రమోషన్ మరింత ఊపందుకునే అవకాశముంది.
పాన్-ఇండియా విడుదలకు సిద్ధం
పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల వల్ల, కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల చాలా వాయిదా పడింది. అయినప్పటికీ అభిమానుల అంచనాలు ఎక్కడ తగ్గలేదు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మించగా, సంగీతం ఎం.ఎం. కీరవాణి అందించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన విలన్‌గా కనిపించగా, నిధి అగర్వాల్ మరియు నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుండటంతో పవన్ కళ్యాణ్ పాన్-ఇండియా స్థాయిలో మరోసారి మెరపించనున్నారు.
Read Also ; KTR : రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం