Ghattamaneni Jaya Krishna : సూపర్ స్టార్ Mahesh Babu కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. మహేశ్ బాబు అన్నయ్య, దివంగత నటుడు రమేశ్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. జయకృష్ణ నటిస్తున్న తొలి చిత్రం Srinivasa Mangapuram. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శనివారం మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జయకృష్ణకు, చిత్ర బృందానికి మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. “జయకృష్ణ హీరోగా (Ghattamaneni Jaya Krishna) పరిచయం అవుతున్న తొలి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అతడికి ఆల్ ది బెస్ట్. బలమైన టీమ్, ఆసక్తికరమైన ఆరంభం… చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు
ఈ చిత్రానికి ‘RX 100’ ఫేమ్ Ajay Bhupathi దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నటిస్తుండగా, సంగీతాన్ని ప్రముఖ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సీకే పిక్చర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు భాగస్వాములుగా ఉన్నాయి. ఘట్టమనేని మూడో తరం వారసుడి ఎంట్రీ, భారీ టెక్నికల్ టీమ్ కారణంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: