हिन्दी | Epaper

Gaddar Awards : అల్లు అర్జున్ గద్దర్ అవార్డుపై విమర్శలు

Sudheer
Gaddar Awards : అల్లు అర్జున్ గద్దర్ అవార్డుపై విమర్శలు

తెలంగాణలో గద్దర్ పేరిట అందజేసిన అవార్డులు (Gaddar Awards) ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఉత్తమ నటుడిగా, ‘కల్కి 2898 ఏ.డి.’ సినిమాకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్‌కు ఉత్తమ దర్శకుడిగా గద్దర్ అవార్డు ప్రకటించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఈ అవార్డుల ఎంపిక గద్దర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఉందంటూ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రజాకార్ సినిమాపై అభ్యంతరం

వేదిక అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ‘రజాకార్’ చిత్రాన్ని ఉత్తమ చారిత్రక చిత్రంగా ఎంపిక చేయడం ద్వారా తెలంగాణ చరిత్రను తిప్పిచూసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ చిత్రం తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా ఉందని, ఇటువంటి సినిమాలకు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం దారుణమన్నారు. గద్దర్ ఉద్యమాల ఆత్మను అవమానించేలా ఇవన్నీ ఉన్నాయని ఆరోపించారు.

సీఎం రేవంత్ స్పందించాలంటూ డిమాండ్

వేదిక వారు ఈ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గద్దర్ ఆశయాలను కాపాడే విధంగా అవార్డుల ఎంపిక జరిగి ఉండాలని, కమర్షియల్ సినిమాలకు గద్దర్ పేరిట గుర్తింపు ఇవ్వడం తగదని వారు స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ పోషించిన పాత్రను గుర్తించి, ఆ విలువలకు తగినవారికే అవార్డులు ఇవ్వాలన్నది వేదిక అభిప్రాయం.

Read Also : Gaddar awards : తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

📢 For Advertisement Booking: 98481 12870