Chiranjeevi box office : మెగాస్టార్ Chiranjeevi నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద మళ్లీ జోరు పెంచుకుంది. సంక్రాంతి తర్వాత రెండో వారంలో వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ, లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో సినిమా మరోసారి పుంజుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రేక్షకుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది.
దర్శకుడు Anil Ravipudi తెరకెక్కించిన ఈ సినిమా తొలి వారంలోనే భారీ వసూళ్లు సాధించింది. పండగ వాతావరణం, చిరంజీవి క్రేజ్, ఫ్యామిలీ (Chiranjeevi box office) ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. అయితే వీక్‌డేస్‌లో వసూళ్ల వేగం తగ్గడంతో సినిమా జోరు తగ్గిందన్న చర్చలు వినిపించాయి.
Read Also: Pakistan: షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి
లాంగ్ వీకెండ్ రావడంతో ఆ అనుమానాలకు బ్రేక్ పడింది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో రాబోయే మూడు రోజులు సినిమాకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీకెండ్ కలెక్షన్లు ఫైనల్ రన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో విక్టరీ Venkatesh చేసిన వెంకీ గౌడ పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. చిరంజీవి–వెంకటేశ్ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, Nayanthara గ్లామర్, భీమ్స్ సంగీతం సినిమాకు మరింత బలంగా నిలుస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: