క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకుల రాక కొంత మేర పెరిగినప్పటికీ, సినిమాల వసూళ్లు మాత్రం పూర్తిగా కంటెంట్‌పై ఆధారపడి(boxoffice collection) ఉన్నాయని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తుండగా, సగటు లేదా బలహీన కథనంతో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోతున్నాయని అంటున్నారు. ఛాంపియన్’ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.8.89 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘శంబాల’ చిత్రం మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.4 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
Telugu Movies: 2025లో అంచనాలు అందుకోలేకపోయిన టాలీవుడ్ సినిమాలు

‘ఛాంపియన్’ సినిమాకు స్టార్ క్యాస్ట్, ప్రమోషన్లు కలిసి రావడంతో ప్రారంభం నుంచి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీక్‌డేస్‌లో కలెక్షన్లు నిలబడాలంటే మౌత్ టాక్ కీలకంగా(boxoffice collection) మారుతుందని పేర్కొంటున్నారు. ‘శంబాల’ సినిమా పరిమిత బడ్జెట్‌తో విడుదలై కూడా మోస్తరు వసూళ్లు సాధించడం సానుకూల అంశంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు ‘దండోరా’ చిత్రానికి సరైన ప్రచారం లేకపోవడం, కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వలన వసూళ్లు తక్కువగా నమోదయ్యాయని ట్రేడ్ విశ్లేషణ. రాబోయే రోజుల్లో న్యూ ఇయర్ వీకెండ్ కలెక్షన్లు సినిమాల భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని, అప్పటివరకు బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారనుందని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: