నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల ‘అఖండ 2’ చిత్రంతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటించబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్‌పై అటు నందమూరి అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కోసం ఒక కథను అనుకున్నప్పటికీ, ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా దాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు సరికొత్త కథతో, మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని గోపీచంద్ మలినేని నిర్ణయించుకున్నారట. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ స్టైల్ మాస్ ఎలివేషన్లు కలగలిపి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో బలమైన ఎమోషన్ కూడా ఉంటుందని టాలీవుడ్ వర్గాల టాక్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక మరియు లోకేషన్ల వేటలో చిత్ర బృందం బిజీగా ఉంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బాలయ్య తన రాజకీయ బాధ్యతలు మరియు ఇతర సినిమాల షెడ్యూల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూనే ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో, ‘వీరసింహారెడ్డి’ మ్యాజిక్‌ను మించి ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Read hindi news: http://hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com