AR Rahman controversy : ప్రముఖ సంగీత దర్శకుడు A. R. Rahman చేసిన తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. బాలీవుడ్ పని అవకాశాలు, పవర్ స్ట్రక్చర్‌పై రెహమాన్ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు అవసరం లేదని, ఇలాంటి మాటలు అపార్థాలకు దారితీస్తాయని బాలీవుడ్ వర్గాలు స్పందిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెహమాన్ గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించడం లేదు. హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆయన, స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ప్రధానంగా తమిళ, తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కూడా పలు దక్షిణాది చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఆయన పేరు వినిపించకపోవడంపై ఇప్పటికే పలు ఊహాగానాలు ఉన్నాయి.
మతం అంశంపై వ్యాఖ్యలు
ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో దక్షిణాది కళాకారులపై పక్షపాతం ఉందా? అనే ప్రశ్నకు స్పందించిన రెహమాన్, వ్యక్తిగతంగా (AR Rahman controversy) తాను ఎప్పుడూ వివక్షను ఎదుర్కోలేదన్నారు. అయితే గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో ‘పవర్ షిఫ్ట్’ జరిగిందని, సృజనాత్మకత లేని వ్యక్తులే కీలక స్థానాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనికి మతపరమైన అంశం కూడా ఒక కారణం కావొచ్చని, అయితే అది తనకు నేరుగా ఎదురుకాలేదని, గుసగుసల రూపంలో మాత్రమే వినిపించిందని చెప్పారు. తాను పని కోసం వెతకనని, నిజాయితీ ఉంటే పనులే మన వద్దకు వస్తాయని నమ్ముతానని రెహమాన్ తెలిపారు.
Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం
బాలీవుడ్ నుంచి తీవ్ర స్పందన
రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ రచయిత్రి Shobhaa De ఈ వ్యాఖ్యలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. ఇలాంటి మాటలు అనవసరంగా వివాదాలను రేపుతాయని ఆమె అన్నారు. అలాగే ప్రముఖ కవి, రచయిత Javed Akhtar స్పందిస్తూ—రెహమాన్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వాటిని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

రెహమాన్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడానికి మతం కారణం కాదని జావేద్ అక్తర్ స్పష్టం చేశారు. ముంబయిలో తనకు తెలిసిన చాలా మంది రెహమాన్‌ను ఎంతో గౌరవిస్తారని తెలిపారు. అయితే ఆయన అంతర్జాతీయ ప్రాజెక్టులు, విదేశీ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండటం, అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం వల్ల చిన్న నిర్మాతలు ఆయనను సంప్రదించలేకపోవడం వంటి అంశాలు కారణమై ఉండొచ్చన్నారు. ఇదే అంశంపై పలువురు గాయకులు, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ—నిజంగా మతమే కారణమై ఉంటే, ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉండేవారు కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: