हिन्दी | Epaper

రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత దిల్ రాజు

Sudheer
రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గల సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తనకు ఇచ్చిన కీలక పదవికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం తనను నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.

దిల్ రాజు తో పటు తన సోదరుడు శిరీష్‌ కూడా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి, రంగంలో కొత్త అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిల్ రాజును శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజును ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల జారీ చేశారు.

2003లో విడుదలైన దిల్ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దిల్ రాజు, టాలీవుడ్‌లో అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగారు. ఈ సినిమా విజయంతో ఆయన పేరు పరిశ్రమలో దిల్ రాజుగా మారింది. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

📢 For Advertisement Booking: 98481 12870